
ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయండి
పుట్టపర్తి అర్బన్: మహిళల ఆరోగ్యం కోసం బుధవారం నుంచి జరిగే ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని వైద్యాధికారులకు స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమ స్టేట్ నోడలాఫీసర్ డాక్టర్ అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగంతో కలసి వైద్యాధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ప్రణాళికా బద్దంగా అన్ని శాఖల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అక్టోబర్ 2 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
మహిళల ఆరోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యం
హిందూపురం: మండలంలోని బేవనహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం డాక్టర్ అనిల్‌కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మాతాశిశు సంరక్షణ సేవలు, వివిధ రకాల పరీక్షలు, పౌష్టికాహారం, ఉచిత మందుల పంపిణీ తదితరాలపై ఆరా తీశారు. అక్టోబరు 2వ తేదీ వరకూ జరిగే మహిళల ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. డీఐఓ నాగేంద్రనాయక్, పీఓ సునీల్‌కుమార్, మెడికల్ ఆఫీసర్ పద్మజ, ఎంహెచ్‌ఓ మల్లప్ప, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.