
సర్కారుపై సమరమే
ఉపాధ్యాయ సమస్యలపై కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా ఉంది. అందుకే సమరమే సిద్ధమవుతున్నాం. ఈ నెల 15 నుంచి యూటీఎఫ్ తలపెట్టిన రణభేరి బైక్ జాతా 17న జిల్లాలో పర్యటిస్తుంది. టీచర్లను బోధనేతర పనులకు దూరం చేయాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ ద్వారా పదోన్నతులు కల్పించాలి. పెండింగ్ డీఏలు తక్షణం ఇవ్వాలి. 12వ పీఆర్‌సీ ఏర్పాటుతో పాటు అంతవరకూ 29 శాతం ఐఆర్ ఇవ్వాలనేవి ప్రధాన డిమాండ్లు. – శెట్టిపి జయచంద్రారెడ్డి,
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు