
అడుగుకో గుంత.. తీరని జనం చింత!
కొత్తచెరువు రైల్వే ట్రాక్ దాటగానే ఛిద్రమైన రోడ్డు
ఓడీసీలో గుంతలమయమైన ప్రధాన రోడ్డు
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ఎటు చూసినా కంకర తేలి, గుంతలు పడిన దారులే కనిపిస్తున్నాయి. దీంతో అధికారులు వేసిన ప్యాచ్ వర్క్ కేవలం ఆరు నెలలకే వెలసి పోయి రోడ్లన్నీ తిరిగి గుంతలమయమయ్యాయి.
పాయ్‌చ్ వర్క్‌కు రూ.20 కోట్లు
ఇటీవల జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో రోడ్లు గుంతలమయ్యాయి. దీంతో రూ.20 కోట్లు వెచ్చించి ప్యాచ్ వర్క్ పనులు చేపట్టారు. ఒక్కో నియోజక వర్గానికి రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకూ వెచ్చించారు. అయితే పనులు నాసిరకంగా చేయడంతో ఆరు నెలలు తిరగకనే గుంతలు పడ్డాయి. పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, కదిరి, పెనుకొండ మడకశిర నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల రహదారులు మరీ అధ్వానంగా మారాయి. గుంతల మయమైన రహదారుల్లో ప్రయాణం సాగించలేకపోతున్నామని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తికి వచ్చే రహదారులన్నీ ఛిద్రం కావడంతో ఆ మార్గంలో ప్రయాణించే దేశవిదేశీ భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పరువు తీస్తున్నారంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు. మరో 70 రోజుల్లో సత్యసాయి శత జయంతి వేడుకలు ప్రారంభకానున్నాయి. ఇలాంటి తరుణంలో రహదారుల మరమ్మతు పనులు నాణ్యతతో చేస్తారో లేదో వేచి చూడాలి.
ఛిద్రమైన రహదారులు
నాసిరకంగా ప్యాచ్ వర్కులు
రోజుల వ్యవధిలోనే తిరిగి గుంతల మయం

అడుగుకో గుంత.. తీరని జనం చింత!