కదిరి: గణేశ్ నామస్మరణతో కదిరి పురవీధులు పులకించాయి. వినాయక చవితి రోజున వాడవాడలా కొలువుదీరిన వినాయక విగ్రహాలకు ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఏడవ రోజు మంగళవారం నిమజ్జనం–శోభాయాత్ర నిర్వహించారు. తొలుత మండపాల వద్ద గణేశునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో ప్రతిమలను కొలువుదీర్చారు. ఇక నృసింహాలయం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా.. నిర్ణయించిన శుభ ఘడియల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు భక్తులు స్వామివారి వాహనాన్ని లాగి ప్రారంభించారు. సింహకోట, ఎర్రకోట, శివాలయం, రైల్వేగణేష్ విగ్రహాలను మాత్రమే గతంలో హిందూ, ముస్లింలు కలిసి చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆలంఖాన్ వలి మసీదు ముందు నుంచి తీసుకెళ్లారు. మిగిలిన విగ్రహాలన్నీ హిందూపూర్ సర్కిల్ మీదుగా నిమజ్జన ప్రదేశం రామనారాయణకుంటకు వెళ్లాయి. ఎస్పీ రత్న దగ్గరుండి బందోబస్తును పర్యవేక్షించారు. సుమారు 400 మంది దాకా పోలీసులు బందోబస్త్‌లో పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు.
ఉల్లాసం..ఉత్సాహం
చిన్నా, పెద్దా, ఆడ, మగ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా పట్టణ ప్రజలు గణేశ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. యువకులు శోభాయాత్రలో చిందులు వేస్తూ ముందుకు సాగారు. పలు వీధుల నుంచి వచ్చిన గణనాథులు తెల్లని కాంతులతో ఆకాశ హర్‌ామ్యలతో పోటీ పడ్డాయి. బాణసంచా ఆకాశాన కాంతులీనుతుండగా అందరూ రంగులు చల్లుకొని మెరుపులై మెరిశారు. భక్త జనుల గణేశ నామస్మరణల మధ్య పార్వతీ తనయుడికి ఎంపీడీఓ కార్యాలయానికి సమీపంలో ఉన్న రామనారాయణ కుంటలో క్రేన్‌ల సాయంతో నిమజ్జనం చేశారు. ఈసారి ముస్లింలు స్వామివారి వాహనాన్ని లాగడం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
గణపతి బప్ప మోరియా
గణపతి బప్ప మోరియా
గణపతి బప్ప మోరియా
గణపతి బప్ప మోరియా
గణపతి బప్ప మోరియా
గణపతి బప్ప మోరియా
గణపతి బప్ప మోరియా
గణపతి బప్ప మోరియా
గణపతి బప్ప మోరియా