
అలరించిన ‘కరిష్యే వచనం తవ’
ప్రశాంతి నిలయం: సత్యసాయి బోధనలు ఆచరణీయమన్న సందేశాన్నిస్తూ ‘కరిష్యే వచనం తవ’ పేరుతో బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన నృత్యరూపకం నయనమనోహరంగా సాగింది. పర్తియాత్రలో భాగంగా హర్యానా, చండీఘర్ రాష్ట్రాల సత్యసాయి భక్తులు సోమవారం సత్యసాయి సన్నిధిలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ‘సాయి శ్రవణ్ సుర్ సరిత’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం బాలవికాస్ చిన్నారులు సత్యసాయి చాటిన సందేశాన్ని వినిపిస్తూ, ‘సత్యసాయి బోధనలు ఆచరిస్తాం’’ అంటూ తమ విధేయతను చాటుతూ నిర్వహించిన సంగీత నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

అలరించిన ‘కరిష్యే వచనం తవ’