
పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు తగదు
మడకశిర: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు తగదని సీఎం చంద్రబాబుకు మడకశిర నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప హితవు పలికారు. పద్ధతి మార్చుకోకపోతే రాజకీయ పరాభవం తప్పదని హెచ్చరించారు. ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు మంగళవారం మడకశిరలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిథున్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ గంటపాటు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఈరలక్కప్ప మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరెస్ట్‌లకు వైఎస్సార్‌సీపీ నాయకులు భయపడరన్నారు. అభివృద్ధిని విస్మరించి వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. లేని లిక్కర్ కేసును సృష్టించి, ఎలాంటి సంబంధం లేని ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కడిగిన ముత్యంలా మిథున్‌రెడ్డి ఈ కేసు నుంచి బయటకు వస్తారన్నారు. చంద్రబాబు హయాంలో జరిగింది లిక్కర్ స్కాం అని తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో లిక్కర్ స్కాం జరగకున్నా చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం మానుకోపోతే ప్రజలు ఎదురు తిరగడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి, మున్సిపల్ మాజీ చైర్మన్ జయరాజ్, ఎంపీపీ సత్యనారాయణరెడ్డి, మండల కన్వీనర్లు రామిరెడ్డి, త్రిలోక్‌నాథ్, పట్టణ అధ్యక్షుడు వాల్మీకి సతీష్‌కుమార్, పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు శేషు, మల్లికార్జునగౌడ్, మంజునాథ్, శివన్న, నరసింహ, సికిందర్, మాజీ డైరెక్టర్ నాగరాజు, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి శ్రీరాములు, పార్టీ అనుబంధ కమిటీల సభ్యులు అంజలి, నగేష్, గోపి, నాగభూషణ్‌రెడ్డి, రంగనాథ్, సైఫుల్లా, హనుమంతు, మధు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుకు రాజకీయ పరాభవం తప్పదు
వైఎస్సార్‌సీపీ మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప