
రాజకీయ దురుద్దేశంతోనే అక్రమ అరెస్ట్
కదిరి: రాజకీయ దురుద్దేశంతోనే రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని వైఎస్సార్‌సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన కదిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపి ప్రభుత్వం శునకానందం పొందుతోందన్నారు. పాలన మరిచి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తే భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు పక్కనబెట్టి, అక్రమ అరెస్ట్‌లతో డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సరైన సమయంలో ప్రజలే ఆయనకు తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు. లిక్కర్ స్కాం అనేది పూర్తిగా చంద్రబాబు కల్పితమని, ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన మిధున్‌రెడ్డితో పాటు మిగిలిన వారు కూడా కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయమన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్.మక్బుల్ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోకేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో పాల్గొన్న వై.విశ్వేశ్వరరెడ్డి, మక్బుల్ అహ్మద్, తదితరులు