
18 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలోని 18 మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. లేపాక్షి మండలంలో 19.2 మి.మీ, హిందూపురం మండలంలో 11.2, అమరాపురంలో 9.8, ఎన్‌పీ కుంటలో 7.4, గుడిబండలో 7.4, సోమందేపల్లిలో 7.4, బత్తలపల్లిలో 7.2, తాడిమర్రిలో 6.8, రొళ్లలో 6.2, తనకల్లులో 5.8, గాండ్లపెంటలో 5.4, తలుపులలో 5.2, మడకశిరలో 5.2, అగళిలో 4.6, పెనుకొండలో 4.4, కదిరిలో 2.4, ధర్మవరంలో 2.2, నల్లచెరువులో 2 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో పాటు ఆదివారం సాయంత్రం ధర్మవరం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాల్లో జల్లులు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రెయినేజీలు పొంగి పొర్లాయి. జిల్లాలో మరో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.

18 మండలాల్లో వర్షం