
నేరాల నియంత్రణ ఎలా..?
మడకశిర: అంతర్రాష్ట్ర నేరాలు అధికంగా నమోదవుతున్న మడకశిర నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత అధికంగా ఉంది. గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించి నమోదైన కేసుల్లో కొన్నింటిని మాత్రమే పోలీసులు ఛేదించారు. చాలా కేసులు మిస్టరీగానే మిగిలిపోయాయి. మడకశిర అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్‌తో పాటు రూరల్ సర్కిల్ పరిధిలోని అగళి, రొళ్ల, అమరాపురం, అగళి స్టేషన్ల పరిధిలో కానిస్టేబుళ్ల కొరత తీవ్రంగా ఉంది. 105 మంది కానిస్టేబుళ్లు ఉండాల్సి ఉండగా సగం స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 20 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు 10 మంది మాత్రమే ఉన్నారు. చాలామంది కానిస్టేబుళ్లు డిప్యుటేషన్‌పై ఇతర పోలీస్‌స్టేషన్లకు కూడా వెళ్లారు.
సబ్‌డివిజన్ ఏర్పాటుపై నిర్లక్ష్యం..
మడకశిర కేంద్రంగా పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంతలోనే ప్రభుత్వం మారింది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సబ్ డివిజన్ ఏర్పాటుపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో సబ్‌డివిజన్ ఏర్పాటు ప్రక్రియ ప్రతిపాదనలకే పరిమితమైపోయింది. రూరల్ పోలీస్ సర్కిల్ ఏర్పాటైనా కార్యాలయం మాత్రం మడకశిరలోనే కొనసాగుతోంది. ఈ సర్కిల్ పరిధిలోని అగళి, రొళ్ల, అమరాపురం, గుడిబండ మండలాల ప్రజలు ఏదైనా పనిమీద సీఐని కలవలంటే మడకశిరకే రావాల్సిన పరిస్థితి నెలకొంది.
కండీషన్ లేని వాహనాలతో తంటాలు..
ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఒక వాహనం ఉండాలి. అయితే గుడిబండ పోలీస్‌స్టేషన్‌కు వాహన సౌకర్యం లేదు. ఈ వాహనం కండీషన్ లేకపోవడంతో ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. మళ్లీ కొత్త వాహనాన్ని కేటాయించలేదు. ప్రస్తుతం గుడిబండ పోలీస్‌స్టేషన్‌కు వాహనం లేకపోవడంతో విధులు నిర్వర్తించడానికి పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన పోలీస్‌స్టేషన్లకు కేటాయించిన వాహనాలు కూడా కండీషన్‌లో లేకపోవడంతో పోలీసులు తంటాలు పడుతున్నారు.
శిథిలావస్థలో పోలీస్ గృహాలు..
మడకశిరలో పోలీస్ నివాస గృహాలు శిథిల దశకు చేరుకున్నాయి. వర్షం వస్తే కారుతున్నాయి. అమరాపురంలో ఉన్న పోలీస్ నివాస గృహాలను కూలదోశారు. వాటి స్థానంలో కొత్త గృహాలను నిర్మించలేదు. అగళి, రొళ్ళ, గుడిబండలో పోలీస్ నివాస గృహాలు లేవు. అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు.
హోం మంత్రి దృష్టి సారించేరా?
రాష్ట్ర హోం మంత్రి అనిత సోమవారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తారేమోనని పోలీసులు ఆశతో ఎదురు చూస్తున్నారు. పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుపైనా ప్రకటన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నేడు హోం మంత్రి రాక
మడకశిర: రాష్ట్ర హోంమంత్రి అనిత సోమవారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మడకశిరలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడతారు. 10.30 గంటలకు చీపులేటి వద్ద ఉన్న ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్‌ను సందర్శిస్తారు. 11 గంటలకు గుడిబండలో పర్యటిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు మడకశిర పోలీస్‌స్టేషన్‌ను సందర్శిస్తారు. 4.45 గంటలకు వైఎస్సార్ సర్కిల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. హోం మంత్రి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నరసింగప్ప ఆదివారం తెలిపారు.
హోం మంత్రి అనితకు ‘సమస్యల హారం’
కర్ణాటక సరిహద్దు స్టేషన్లలో పోలీసుల కొరత
మిస్టరీగానే మిగిలిపోతున్న
అంతర్రాష్ట్ర నేరాల కేసులు
పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు
ప్రతిపాదనలకే పరిమితం
శిథిల దశలో పోలీసుల నివాస గృహాలు
ఇది అగళి పోలీస్ స్టేషన్. నియోజకవర్గ కేంద్రం మడకశిరకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటక సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర నేరాలు నమోదవుతుంటాయి. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది కొరతే. 21 మంది కానిస్టేబుళ్లకు గాను ఐదుగురు మాత్రమే ఉన్నారు. 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక రెండు హెడ్‌కానిస్టేబుళ్ల పోస్టులకు గాను

నేరాల నియంత్రణ ఎలా..?