హిందూపురం టౌన్: పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లా ఫుట్‌బాల్ సీనియర్ సీ్త్ర, పురుషుల జట్ల ఎంపిక చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు జేవీ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ఆధార్‌కార్డు, బర్త్ సర్టిఫికెట్, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో ఆదివారం ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. 2009 డిసెంబర్ 31వ తేదీ లోపు జన్మించిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు అసోసియేషన్ కార్యదర్శి బీకే మహమ్మద్ సలీమ్ సెల్ నంబర్ 80995 98958కు సంప్రదించాలని సూచించారు.
14 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లాలోని 14 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. కొన్ని చోట్ల జల్లులు కురిశాయి. అత్యధికంగా పెనుకొండలో 21.4 మి.మీటర్లు, గోరంట్లలో 17.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే రొద్దంలో 9.8, కొత్తచెరువులో 9.2, ధర్మవరంలో 5.8, పుట్టపర్తిలో 5.4, సోమందేపల్లిలో 5.4, చిలమత్తూరులో 3.8, రామగిరిలో 2.6, అమరాపురంలో 2.4. ఓడీసీలో 2.4, బత్తలపల్లిలో 2.2, సీకే పల్లిలో 1.6, బుక్కపట్నంలో 1 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో మరో నాలుగు రోజులు వర్షాలు కురవచ్చని పేర్కొన్నారు.
ఇంటి నుంచే తపాలా సేవలు
హిందూపురం: అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0తో ఇకపై వివిధ రకాల పోస్టల్ సేవలను ఇంటి నుంచే సెల్‌ఫోన్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు హిందూపురం పోస్టల్ సూపరింటెండెంట్ విజయకుమార్ తెలిపారు. గురువారం డివిజనల్ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీని ఈ నెల 22 నుంచి హిందుపురం డివిజన్ పరిధిలోని 472 పోస్ట్ ఆఫీసుల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
ఈ సేవలను ప్రారంభించేందుకు వీలుగా ఈ నెల 21న డివిజన్ పరిధిలోని పోస్టు ఆఫీసులలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించబోమన్నారు. ఆ రోజు అన్ని రకాల సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వేగవంతమైన సర్వీస్ డెలివరీ, కస్టమర్లకు స్నేహపూర్వక సేవలు అందించేందుకు చర్యలు చేపడుతునట్లు పేర్కొన్నారు. పెరిగిపోతున్న సాంకేతికత పరిజ్ఞానానికి అనుగుణంగా పోస్టల్‌శాఖ కూడా మార్పుచెందుతోందన్నారు.

20న ఫుట్‌బాల్ జట్ల ఎంపిక

14 మండలాల్లో వర్షం