
రాష్ట్రస్థాయి రోల్ బాల్ పోటీలకు ఎంపిక
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని గొట్లూరు వద్ద ఉన్న నైరా ఎరుడైట్ ఈఎం స్కూల్‌కు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి రోల్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్ శ్వేతా తెలిపారు. చార్విక్ దేవ్ (అండర్–11), గగన్‌దీప్ (అండర్–11), ఫణిబాబు(అండర్–14), నందకిషోర్ (అండర్–14), లోచన్ (అండర్–17) ఎంపియ్యారన్నారు. జూలై 19, 20 తేదీల్లో కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి రోల్ బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను కరస్పాండెంట్ శ్వేతా, ప్రిన్సిపాల్ వెంకటేష్, కోచ్ భార్గవ్ తదితరులు అభినందించారు.