
● చూసిన కనులదే భాగ్యం..
పుట్టపర్తి అర్బన్: మండలంలోని సుబ్బరాయునిపల్లి సమీపంలో చౌటవంకలో వెలసిన సప్తమాతృక అక్కమ్మ దేవతల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బాలికల కుంకుమార్చన, బాలుర నెమలి ఈకల నివేదన కార్యక్రమంతో జాతర పూర్తయింది. ఈ సందర్భంగా అక్కమ్మ దేవతల మూల విరాట్‌లను విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం అక్కమ్మ దేవతలకు ప్రతీకగా ఏడుగురు బాలికలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దైపె కుంకాలు చెరిగారు.ఎడ్ల బండ్లను ఊరేగించారు.

● చూసిన కనులదే భాగ్యం..