
రాజీమార్గమే రాజమార్గం
హిందూపురం: రాజీమార్గమే రాజమార్గమని, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లునాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాదులు మధ్యవర్తిత్వంపై అవగాహన పెంచుకొని కక్షిదారుల సమస్యలను పరిష్కరించడంలో సహకరించాలన్నారు. ఇరువర్గాలు ఒక అవగాహనకు వచ్చి రాజీ కావడంతో డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. ఇందుకు లోక్‌అదాలత్ బాగా ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో న్యాయవాదులు సిద్ధు, రాజశేఖర్, కళావతి, సంతోషికుమారి తదితరులు పాల్గొన్నారు.
జాబిలికి ఇంటర్నేషనల్
గ్లోరీ పురస్కారం
పెనుకొండ: పట్టణానికి చెందిన ప్రముఖ కవి జాబిలి చాంద్‌బాషాకు ఇంటర్నేషనల్ గ్లోరీ పురస్కారం దక్కింది. శుక్రవారం హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గానసభ వేదికగా మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు మహాకవి సమ్మేళనంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న చాంద్‌బాషాకు ప్రముఖ కవులు రమణాచారి, రఘువీర్‌ప్రతాప్, డాక్టర్ చక్రవర్తి తదితరులు పురస్కారం అందజేసారు.

రాజీమార్గమే రాజమార్గం