
టీడీపీ ట్రోల్స్‌పై న్యాయవాదుల ఆగ్రహం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సాగిస్తున్న ట్రోల్స్‌పై జిల్లా న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ట్రోల్స్‌ను ఖండిస్తూ బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిపై జరుగుతున్న ట్రోలింగ్‌ను న్యాయవ్యవస్థపై దాడిగా అభి వర్ణించారు. సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తిపైనే ట్రోలింగ్ చేస్తే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రోలింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం రెండు రోజుల పాటు న్యాయవాదులు విధులు బహిష్కరించాలని బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బడా నారాయణరెడ్డి, శ్రీకాంత్, భరత్‌భూషణ్ రెడ్డి, అవ్వా సురేష్ తదితరులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు బార్ అసోసియేషన్ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో బుధ, గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించనున్నారు.
నేటి నుంచి రెండు రోజుల పాటు విధుల బహిష్కరణ