
ఒక్క హామీనైనా అమలు చేశారా?
చిలమత్తూరు: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్‌సిక్స్ హామీలు ఇచ్చి మరచిపోయారు. ప్రజలను కూడా మరచిపోయి.. ప్రాజెక్టులు, అమరావతి, యోగాంధ్ర అంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’ అని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంటు పరిశీలకుడు రమేష్‌రెడ్డి విమర్శించారు. 143 హామీలు ఇచ్చి ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. హిందూపురం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. రమేష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేరడం లేదని చంద్రబాబు, లోకేష్ చెబుతున్నారని, ఈ వైఫల్యానికి కారణం మీరు కాదా అని మండిపడ్డారు. చంద్రబాబు తనను తాను మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్‌తో పోల్చుకోవడం సిగ్గుచేటన్నారు.
పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు
పార్టీ లైన్ దాటి వైఎస్సార్‌సీపీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని రమేష్‌రెడ్డి హెచ్చరించారు. గీత దాటిన వారి లిస్ట్ అధిష్టానం వద్ద ఉందని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.
స్వలాభమే బాబుకు ముఖ్యం
రాష్ట్రంలో ప్రజలు అప్పుల పాలవుతున్నా సీఎం చంద్రబాబు తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దీపిక ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు స్వలాభం కోసమే ప్రభుత్వం నడుపుతున్నారని, పేదలను ఆదుకునేందుకు కాదన్నారు. ఎన్నికల సమయంలో ఓటరు ఇంటికెళ్లి నా కుటుంబం అన్న సీఎం చంద్రబాబు, గెలిచాక నాకేంటి సంబంధం అంటున్నాడని విమర్శించారు. సీనియర్ నాయకుడు బాలాజీ మనోహర్ మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గంలో స్థానికేతరులను గెలిపించుకొని పరిపాలన అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితుల్లో పురం ప్రజలు ఉన్నారని, ఇకనైనా స్థానికులకు అవకాశం కల్పించిన వైఎస్సార్‌సీపీకి పట్టంకట్టాలన్నారు. మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుమతిరెడ్డి మాట్లాడుతూ ఏదైనా సమస్యపై మాజీ సీఎం వైఎస్ జగన్ గళమెత్తితేగాని కూటమి ప్రభుత్వంలో చలనం ఉండడం లేదన్నారు. ఆయన వస్తున్నారంటే అప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తోందన్నారు. ఇప్పుడు సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ మాజీ సీఎం జగన్ సమస్య తెలుసుకోవడానికి వస్తే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి, రాష్ట్ర కురుబ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్‌ఏ శివ, రాష్ట్ర కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ ఆసిఫుల్లా, జిల్లా అధికార ప్రతినిధి శివశంకర్‌రెడ్డి, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు వాల్మీకి లోకేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, కవితారెడ్డి, శ్రీరామిరెడ్డి, ధనుంజయరెడ్డి, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీ సురేష్‌కుమార్‌రెడ్డి, మండల కన్వీనర్లు రాము, రామకృష్ణారెడ్డి, సయ్యద్ నిస్సార్, ఎంపీపీ రత్నమ్మ, వైస్ ఎంపీపీ అంజన్‌రెడ్డి, తిమ్మిరెడ్డి, వైస్ చైర్మన్ జబీవుల్లా తదతరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ
పార్లమెంట్ పరిశీలకుడు రమేష్‌రెడ్డి