
ఫెన్సింగ్ పోటీల్లో జస్వంత్‌రెడ్డి సత్తా
తలుపుల : రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో తొగటవాండ్లపల్లికి చెందిన బి.రామాంజులురెడ్డి, సరస్వతి దంపతుల కుమారుడు బి.జస్వంత్‌రెడ్డి సత్తా చాటాడు. జూన్ 29న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన అండర్ –10 మినీ స్టేట్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని ఇప్పి విభాగంలో సిల్వర్ మెడల్ సాదించాడు. అనంతపురం ఎంకే స్పోర్ట్ అకాడమీలో ఫెన్సింగ్‌లో జస్వంత్‌రెడ్డి శిక్షణ తీసుకున్నాడు. సిల్వర్ మెడల్ పొందినందుకు జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, జిల్లా సెక్రటరీ సరస్వతి, స్పోర్ట్ అకాడమీ కోచ్ రాహుల్ అభినందించారు. జూలై 5, 6, 7 తేదీల్లో జరగనున్న మినీ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో జస్వంత్ పాల్గొననున్నట్లు కోచ్ రాహుల్ తెలిపారు.