బదిలీల నరకయాతన | - | Sakshi
Sakshi News home page

బదిలీల నరకయాతన

Jul 1 2025 4:34 AM | Updated on Jul 1 2025 4:34 AM

బదిలీ

బదిలీల నరకయాతన

అనంతపురం: ఉమ్మడి జిల్లా సచివాలయ మహిళా పోలీసు సిబ్బంది బదిలీల ప్రక్రియ నరక యాతనను మిగిల్చింది. అనంతపురంలోని డీపీఓలో చేపట్టిన ఈ ప్రక్రియకు ఉదయం 8 గంటలకంతా హాజరు కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటలైనా కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టలేదు. 12 గంటల తర్వాత తొలుత స్పౌజ్‌, పీహెచ్‌సీ, మెడికల్‌ సర్టిఫికెట్‌ ఉన్న వారికి కౌన్సెలింగ్‌ చేపట్టారు. మూడు గంటల వరకు జనరల్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభించలేదు. తెల్లవారుజామున మూడు గంటల వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్న నేపథ్యంలో నిరీక్షణ తప్పలేదు. దీంతో చంటి పిల్లల తల్లులు, దూరప్రాంతాల నుంచి వచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. అవివాహితులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులను లోపలకు అనుమతించకపోవడంతో వారు బయటే నిరీక్షించాల్సి వచ్చింది. మహిళల పట్ల పోలీసు శాఖ నిర్దయగా వ్యవహరిస్తోందని విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు ఆదోనిలో ఓ మహిళా కానిస్టేబుల్‌ చనిపోయిన విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు స్పందించి ఆగమేఘాలపై పిల్లల తల్లులకు పాలు, జ్యూస్‌ అందించారు. కౌన్సెలింగ్‌ కేంద్రంపైన సేద తీరేందుకు అవకాశం కల్పించారు.

స్పౌజ్‌ కోటాలో అభ్యంతరాలు

స్పౌజ్‌ కోటాలో బదిలీలకు సంబంధించి తమ భర్త ఎక్కడ ఉంటాడో ఆ పరిసరాల్లోనే స్థానాన్ని కోరుకోవాలి. అయితే తాడిపత్రి, హిందూపురం పరిసరాల్లో పనిచేస్తున్న కొందరు ఇతర ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వారిని స్పౌజ్‌ పరిసర ప్రాంతాల్లోని స్థానాలు కేటాయించారు.

అర్ధరాత్రి ఆందోళన: గణనీయమైన ర్యాంకు ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పించి వారు కోరుకున్న చోటు కేటాయించాలి. అలాగే రేషనలైజేషన్‌లో పోస్టు కోల్పోయిన వారికి జనరల్‌ కేటగిరి కింద చివరన పిలవాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా కౌన్సెలింగ్‌ చేపట్టారు. దీంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యపు సమాధానంతో పరిస్థితి అదుపు తప్పి అర్ధరాత్రి కౌన్సెలింగ్‌ ఆగిపోయింది. తిరిగి అధికారులు నచ్చచెప్పి కౌన్సెలింగ్‌ను కొనసాగించారు.

బదిలీల నరకయాతన1
1/4

బదిలీల నరకయాతన

బదిలీల నరకయాతన2
2/4

బదిలీల నరకయాతన

బదిలీల నరకయాతన3
3/4

బదిలీల నరకయాతన

బదిలీల నరకయాతన4
4/4

బదిలీల నరకయాతన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement