కూటమి పాలనలో పీఆర్‌ వ్యవస్థ నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో పీఆర్‌ వ్యవస్థ నిర్వీర్యం

Jul 1 2025 4:34 AM | Updated on Jul 1 2025 4:34 AM

కూటమి పాలనలో పీఆర్‌ వ్యవస్థ నిర్వీర్యం

కూటమి పాలనలో పీఆర్‌ వ్యవస్థ నిర్వీర్యం

ప్రశాంతి నిలయం: కూటమి ప్రభుత్వ అశాసీ్త్రయ నిర్ణయాలతో పంచాయతీ రాజ్‌ (పీఆర్‌) వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌కు వినతి పత్రం అందించి, మాట్లాడారు. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,150 కోట్లను కూటమి ప్రభుత్వం దారి మళ్లించడం సిగ్గు చేటన్నారు. వెంటనే ఈ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లోకి జమ చేయాలని డిమాండ్‌ చేశారు. కూలీలకు దక్కాల్సిన ఉపాధి నిధులను టీడీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. సర్పంచులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ వారి పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తించకుండా చేసి ఆ డబ్బులనూ కూటమి ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. తక్షణం సర్పంచుల పిల్లలకు తల్లికి వందనం పథకం లబ్ధి చేకూర్చాలని కోరారు. బిల్లుల చెల్లింపుల్లో రాజకీయ జోక్యం నివారించి, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 73, 74 సవరణల మేరకు సర్పంచులకు అధికారాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న 1,320 మంది పంచాయతీ కార్యదర్శులకు తక్షణమే పోస్టింగ్‌ ఇచ్చి పెండింగ్‌లో ఉన్న 9 నెలల వేతనం విడుదల చేయాలన్నారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు గౌరవ వేతనం పెంచడంతో పాటు వేతనాలను సకాలంలో చెల్లించాలన్నారు. డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ పంచాయతీ రాజ్‌ విభాగం అధ్యక్షులు కులశేఖరరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి, రేగాటిపల్లి ఎంపీటీసీ రవీంద్ర రెడ్డి, మంజునాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ యూత్‌ విభాగం నాయకులు కొండారెడ్డి, భోగి కొండారెడ్డి, విశ్వనాథరెడ్డి, అశ్వత్థరెడ్డి, రాజారెడ్డి, సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement