
బదిలీల తీరుపై ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్ల అసంతృప్తి
అనంతపురం సెంట్రల్: ఉమ్మడి జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ ఆదివారం ఉద్యాన, పశు సంవర్థకశాఖ కార్యాలయాల్లో కొనసాగింది. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్ కింద ధరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్ చేపట్టారు. అయితే కొందరు తాము కోరుకున్న స్థానం కాకుండా మరో స్థానం కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యానశాఖ పరిధిలో చేపట్టిన బదిలీల ప్రక్రియకు 280 మంది విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్‌లు హాజరు కాగా, వారి ఎస్‌ఆర్‌లు ఇతర ధ్రువీకరణ పత్రాలను ఉద్యానశాఖ ఉమ్మడి జిల్లాల డీడీలు ఉమాదేవి, చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్‌రెడ్డి, ఏడీహెచ్ దేవాందన్, సూపరింటెండెంట్ బాషా తదితరులు పరిశీలించి, పోస్టింగ్ కల్పించారు. అలాగే పశు సంవర్థకశాఖ కార్యాలయంలో రెండు జిల్లాల జేడీలు వెంకటస్వామి, శుభదాస్, డీడీలు, సూపరింటెండెంట్‌ల సమక్షంలో జరిగిన కౌన్సెలింగ్‌కు 180 మంది విలేజ్ అనిమిల్ హస్బెండరీ అసిస్టెంట్‌లు హాజరయ్యారు.
వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మె ధ్వంసం
రొద్దం: మండలంలోని బీదానిపల్లిలో ఆరేల్ల క్రితం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మె, శిలాఫలకాన్ని శనివారం రాత్రి టీడీపీ కార్యకర్త చంద్రమౌళి ధ్వంసం చేశాడు. విషయాన్ని గుర్తించిన వైఎస్సార్‌సీపీ నాయకులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రమౌళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గోపాలరెడ్డి, చలపతి, బాబయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు.