
అ‘పూర్వ’ కలయిక
తనకల్లు: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1975–76లో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత రువాత కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తరగతి గదులను ఆత్మీయంగా తాకుతూ నాటి అనుభూతులను గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటిగురువులు కుళ్లాయిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, నవనీతమ్మను సత్కరించారు. అనంతరం తమ సీనియర్ విద్యార్థులైన విశ్రాంత ప్రిన్సిపాల్ బయప్పరెడ్డి, దేశాయి భక్తవత్సలరెడ్డి, నాగేంద్రను సన్మానించారు. తమ బ్యాచ్ విద్యార్థులంతా కలసి పాఠశాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విశ్రాంత టీచర్ భాస్కర్‌రెడ్డి, విశ్రాంత ఎస్‌ఐ మహమ్మద్ రఫీ, రత్నమయ్య, లక్ష్మీనారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, నారాయణ, కృష్ణమూర్తి, సూర్యప్రకాష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.