
● నేత్ర దానం
కదిరి టౌన్: ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిత్యాన్నదాన సత్రం కోసం కృషి చేసిన శ్రీసత్రశాల సాయిరాం ప్రభాకర్ మృతి అనంతరం ఆయన నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేశారు. శనివారం ఉదయం గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ప్రభాకర్ దేహం నుంచి నేత్రాలను అనంతపురం రెడ్‌క్రాస్ సొసైటీ ఐ బ్యాంక్ సిబ్బంది సేకరించారు. మరణానంతరం నేత్రాలను దానం చేసి మరో ఇద్దరికి చూపును ప్రసాదించాలనే లక్ష్యంతో ముందకు వచ్చిన ప్రభాకర్ భార్య సత్రశాల పద్మ, కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
ధర్మవరం: స్థానిక సిద్దయ్యగుట్టకు చెందిన చక్కా వెంకటేష్(62) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో మృతుని నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని భార్య నాగవేణి, కుమార్తెలు రజిత, పూజిత, అల్లుళ్లు బాలాజీ, బింగి మోహన్‌కుమార్‌ను విశ్వదీప సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

● నేత్ర దానం

● నేత్ర దానం