
వ్యవస్థలు నాశనం
పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను కూటమి సర్కారు నాశనం చేసిందని వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్ష నేతలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేసులు పెడతామని, భూములను లాక్కుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడవద్దని అన్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు. అధికారులు, పోలీసులుకు భారత రాజ్యాంగం ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చారని, దానికి లోబడే పని చేయాలని హితవు పలికారు. రెడ్‌బుక్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తించి విమర్శలపాలు కావొద్దని పోలీసు అధికారులకు సూచించారు.