మత్తుకు బానిస కావొద్దు | - | Sakshi
Sakshi News home page

మత్తుకు బానిస కావొద్దు

Jun 27 2025 6:31 AM | Updated on Jun 27 2025 6:31 AM

మత్తు

మత్తుకు బానిస కావొద్దు

మంత్రి సవిత

పెనుకొండ: మత్తుకు బానిసలు కాకూడదని యువతకు మంత్రి సవిత పిలుపునిచ్చారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గురువారం పెనుకొండలో మంత్రి ఆద్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన చాలా మంది యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. సమాజానికి చెడు చేయాలని చూసే ఏ వ్యక్తినీ ఉపేక్షించబోమన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌, డీఎస్పీ నర్శింగప్ప, మున్సిపల్‌ కమిషనర్‌ సతీష్‌కుమార్‌, ఎకై ్సజ్‌ సీఐ సృజన్‌బాబు, పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పశువైద్య శిబిరాలను

సద్వినియోగం చేసుకోండి

తనకల్లు: సంగం డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పాడి రైతులకు డెయిరీ కార్య నిర్వాహణాధికారి పర్వతనేని అనిల్‌కుమార్‌ సూచించారు. మండలంలోని పరాకువాండ్లపల్లిలో గురువారం పాడి రైతులకు పశు పోషణ, పాల ఉత్పత్తిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులకు సబ్సిడీపై పశుదాణా, మినరల్‌ మిక్చర్‌ పశుగ్రాస విత్తనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రీజనల్‌ మేనేజర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, జోనల్‌ మేనేజర్‌ రావి బాలాజీ, ఆనంద్‌, మేనేజర్‌ పూజారి నాగరాజు, సిబ్బంది శ్రీధర్‌రెడ్డి, బాదుల్లా, శివయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఇరువర్గాల పరస్పర దాడులు

కదిరి అర్బన్‌: మండలంలోని మరువతండా గ్రామంలో బంధువుల మధ్య గొడవ చోటుచేసుకుని పరస్పరం దాడులు చేసుకున్నారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులు చికిత్స నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. వివరాలు.. కదిరి మండలానికి చెందిన శ్రీవాణి, రవీంద్రనాయక్‌ దంపతులు బతుకు తెరువు కోసం కొన్ని నెలల క్రితం కేరళకు వలస వెళ్లి ఇటీవల వచ్చారు. ఈ క్రమంలో వారితో పాటు వారి మూడేళ్ల వయసున్న కుమార్తె కనిపించకపోవడంతో బంధువు రామచంద్రనాయక్‌ గురువారం నిలదీశాడు. పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో కుమార్తెను కేరళలో విక్రయించి వచ్చారంటూ రామచంద్రనాయక్‌ మండిపడ్డాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ చోటు చేసుకుని పరస్పరం కొట్టుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రామచంద్రనాయక్‌ ఆరోపించినట్లుగా బిడ్డను విక్రయించిన అంశంపై సమగ్ర విచారణ చేపడతామని కదిరి రూరల్‌ అప్‌గ్రేడ్‌ పీఎస్‌ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

డీపీటీఓకు ప్రశంసాపత్రం

పుట్టపర్తి టౌన్‌: గత ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని ఆర్టీసీ ఖాళీ స్థలాలను లీజ్‌కు ఇచ్చి సంస్థకు అధిక ఆదాయం సమకూర్చిన జిల్లా ప్రజా రవాణాధికారి మధుసూదన్‌ను అభినందిస్తూ గురువారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ప్రశంసాపత్రాన్ని అందుకున్న డీపీటీఓను ఆర్టీసీ ఉద్యోగులు అభినందించారు.

ఎకై ్సజ్‌ స్టేషన్‌ తనిఖీ

ధర్మవరం అర్బన్‌: స్థానిక ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌ను గురువారం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య, పుట్టపర్తి అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ నరసింహులు తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. గ్రామాల్లో నాటుసారా తయారీ చేయకుండా తరచూ తనిఖీలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం ఎకై ్సజ్‌ సీఐ చంద్రమణి, ఎస్‌ఐలు చాంద్‌బాషా, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యక్తి ఆత్మహత్య

గుంతకల్లు టౌన్‌: స్థానిక రైల్వేస్టేషన్‌ పార్సిల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్క్‌లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం అటుగా వెళ్లిన ప్రయాణికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని పరిశీలించారు. చొక్కా జేబులో లభ్యమైన ఆధార్‌ కార్డు ఆధారంగా మృతుడు కర్నాటకలోని రాయచూర్‌ జిల్లా గుడెదనాల్‌కు చెందిన శరణప్ప(39)గా గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

మత్తుకు బానిస కావొద్దు 1
1/3

మత్తుకు బానిస కావొద్దు

మత్తుకు బానిస కావొద్దు 2
2/3

మత్తుకు బానిస కావొద్దు

మత్తుకు బానిస కావొద్దు 3
3/3

మత్తుకు బానిస కావొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement