
అమ్మలపై అలసత్వం
4,085
శ్రీసత్యసాయి జిల్లాలో
హెచ్‌ఎంఐఎస్‌లో
నమోదైన ప్రసవాలు
5,280
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అమ్మా పెట్టదు అడుక్కూ తిననివ్వదు’ అన్న చందమిది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం జేఎస్‌వై (జననీ సురక్ష యోజన) ప్రవేశపెట్టింది. ఈ పథకం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత ఘోరంగా అమలవుతున్నట్టు తేలింది. ఆస్పత్రిలో చేరిన గర్భిణి ప్రసవమై డిశ్చార్జ్ అయ్యేలోగా తల్లి వివరాలన్నీ యాప్‌లో నమోదు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. వివరాలన్నీ సరిగా పంపితే తల్లి ఖాతాలోకి రూ.1,500 వేస్తారు. కానీ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కనీసం 55 శాతం మందికి కూడా ఈ పథకం వర్తిచడం లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అంచనా వేయొచ్చు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపం..
అనంతపురంతో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ‘జేఎస్‌వై’ పనితీరు దారుణంగా ఉంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో 84 శాతం మంది తల్లులకు ‘జేఎస్‌వై’ కింద సొమ్ము అందగా, అనంతపురం జిల్లాలో కేవలం 56 శాతం మందికి మాత్రమే అందింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 64 శాతం మందికి మాత్రమే వర్తించింది. ప్రసవం జరిగిన ఆస్పత్రిలో దరఖాస్తు చేయకపోవడం వల్లే వేలాదిమంది బాలింతలు ఇలా తమకు వచ్చే కొద్దపాటి సొమ్మునూ కోల్పోతున్నారు. ఆస్పత్రులకు గర్భిణి రాగానే వివరాలు సేకరించి ఎంఎస్‌ఎస్ (మాతా శిశు సురక్ష) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. భర్త పేరు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు అన్నీ పంపించాలి. కానీ ఈ వివరాలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లోనూ అప్‌లోడ్ చేయడానికి సిబ్బంది లేరు. ఉన్నా చాలా చోట్ల వాళ్ల వివరాలు నమోదు చేయడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నమోదు లేకపోతే ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో అసలే కానరావడం లేదు. దీంతో వేలాది మంది బాలింతలకు లబ్ధి చేకూరడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 2024–25 సంవత్సరంలో 3 లక్షల మంది బాలింతలకు అందలేదు. అంటే ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున రూ.45 కోట్లు కోల్పోయారు. అంతేకాదు ‘జేఎస్‌వై’ సరిగా నమోదు కాకపోవడంతో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద రూ.6 వేలు కూడా చాలామంది కోల్పోతున్నారు. ఆస్పత్రి యాజమాన్యాల నిర్లక్ష్యంతో కేంద్రమిచ్చే నిధులకు పేద బాలింతలు నోచుకోవడం లేదు.
ఎంఎస్‌ఎస్ (మాతా శిశు సురక్షలో నమోదు)
బాలింతలకు కరువైన
‘జేఎస్‌వై’ భాగ్యం
ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేకూరని లబ్ధి
వేలమంది బాలింతలకు
పైసా అందని వైనం
‘అనంతపురం’లో 56 శాతం,
‘శ్రీ సత్యసాయి’ 64 శాతం మందే దరఖాస్తు
3,427
64.91