
‘ఉద్యాన’ పథకాలు వినియోగించుకోండి
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని రెండు జిల్లాల ఉద్యానశాఖ డీడీలు డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్ తెలిపారు. కొత్త తోటల పెంపకంలో భాగంగా హెక్టారుకు మామిడి తోటలకు రెండు సంవత్సరాల్లో రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. జామకు రూ.80 వేలు, చీనీ రూ.50 వేలు, దానిమ్మ రూ.50 వేలు, సీతాఫలం రూ.30 వేలు, సపోటా రూ.30 వేలు, రేగు రూ.30 వేలు, ద్రాక్ష రూ.1.20 లక్షలు, టిష్యూకల్చర్ అరటి రూ.70 వేలు, బొప్పాయి రూ.30 వేలు, డ్రాగన్ ఫ్రూట్ రూ.2.70 లక్షలు, అవకాడో రూ.50 వేలు, అంజూర రూ.50 వేలు, ప్యాషన్ ఫ్రూట్ రూ.2.75 లక్షలు, ఉసిరి రూ.75 వేలు, నేరేడు రూ.75 వేలు, చింత రూ.75 వేలు, ఫల్సాఫ్రూట్ రూ.75 వేలు, విడిపూల సాగుకు రూ.50 వేలు, హైబ్రీడ్ కూరగాయల సాగు రూ.60 వేల మేర రెండేళ్లలో రాయితీ వర్తిస్తుందని తెలిపారు. పుట్టగొడుగుల పెంపకానికి రూ.2 లక్షలు రాయితీ ఉంటుందన్నారు. ముదురుతోటల పెంపకంలో భాగంగా 10 సంవత్సరాల పైబడి వయసున్న మామిడి, 8 సంవత్సరాల పైబడి కలిగిన చీనీ తోటలకు హెక్టారుకు రూ.24 వేలు రాయితీ ఇస్తామన్నారు. వ్యక్తిగత ఫారంపాండ్ల నిర్మాణానికి రూ.75 వేలు, పాలీహౌస్‌ల నిర్మాణానికి రూ.1.25 లక్షలు, షేడ్‌నెట్ హౌస్‌లకు రూ. 8.87 లక్షలు, మామిడి, అరటి ఫ్రూట్ కవర్స్‌కు రూ.25 వేలు, ప్లాస్టిక్ మల్చింగ్‌కు రూ.20 వేలు, ప్యాక్‌హౌస్‌లకు రూ.2 లక్షలు, మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్‌కు రూ.12.85 లక్షలు, మినీట్రాక్టర్‌కు 1.96 లక్షలు, పవర్ టిల్లర్‌కు రూ.లక్ష, తైవాన్ స్ప్రేయర్‌కు రూ.10 వేలు, టమాటా ట్రెల్లీస్‌కు రూ.18,750, హైబ్రీడ్ కూరగాయల విత్తనాలకు రూ.3 వేలు, శాశ్వత పందిళ్లుకు రూ.2.50 లక్షలు మేర రాయితీ వర్తిస్తుందని వివరించారు. అలాగే సోలార్‌కోల్డ్ రూంలు, సోలార్ క్రాప్ డయ్యర్లు, కోల్డ్‌స్టోరేజీల్లో కండెన్సర్ల మార్పు, రిఫర్‌వాన్, ప్లాస్టిక్ క్రేట్స్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన పండ్లతోటల రైతులు ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు, హెచ్‌ఓలు, ఉద్యానశాఖ కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు.
రెండు జిల్లాల డీడీలు ఉమాదేవి,
చంద్రశేఖర్