
అధికారులందరూ సమన్వయంతో పనిచేయండి
ప్రశాంతి నిలయం/పుట్టపర్తి టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 5వ తేదీన కొత్తచెరువులో పర్యటించే అవకాశం ఉందని, అధికారులు సమన్వయంతో సీఎం పర్యటనను విజయవంతంచేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సూచించారు. గురువారం కొత్తచెరువులోని జెడ్పీ బాలుర, బాలికల పాఠశాలలు, సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఎస్పీ వి.రత్న ,జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్‌లతో కలసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కొత్తచెరువులో పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడతారన్నారు. సభా స్థలం, పార్కింగ్ స్థలాల్లో పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు.