
పారిశ్రామిక ప్రగతితోనే అభివృద్ధి
ప్రశాంతి నిలయం: ‘‘పరిశ్రమల స్థాపనతో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాకుండా యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుంది. అందువల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి’’ అని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ...జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి విస్తృత పరిచేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. నూతన పారిశ్రామిక పాలసీకి అనుగుణంగా వ్యవహరిస్తూ జిల్లా ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహం అందివ్వనున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చే వారికి అవసరమైతే బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులపై సమీక్షించారు. అనంతరం వివిధ పరిశ్రమలకు సంబంధించిన రాయితీలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడి రాయితీ కింద 3 యూనిట్లకు రూ.46.69 లక్షలు, వడ్డీ రాయితీ కింద 3 యూనిట్లకు రూ.1.70 లక్షలు మంజూరు చేశారు. అలాగే వివిధ దశల్లో ఉన్న భారీ, పెద్ద తరహా పరిశ్రమల ప్రగతిపై సమీక్షించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, ఎల్డీఎం రమణకుమార్, పరిశ్రమల శాఖ జిల్లా అధికారి రాధాకృష్ణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ జిల్లా అధికారి కృష్ణకుమారి, ఏపీఎస్‌ఎఫ్‌సీ బ్రాంచ్ మేనేజర్ అన్సారీ తదితరలు పాల్గొన్నారు.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను
ప్రోత్సహించాలి
అధికారులకు కలెక్టర్
టీఎస్ చేతన్ ఆదేశం

పారిశ్రామిక ప్రగతితోనే అభివృద్ధి

పారిశ్రామిక ప్రగతితోనే అభివృద్ధి

పారిశ్రామిక ప్రగతితోనే అభివృద్ధి