ప్రశాంతి నిలయం: సత్యసాయి ఆదర్శాలకు అనుగుణంగా రూపొందించిన విద్యావాహని ద్వారా గ్లోబల్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని విద్యావాహిని డైరెక్టర్ కరుణా మున్షి పేర్కొన్నారు. విద్యావాహిని మూడు రోజుల గ్లోబల్ సమ్మిట్ బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో ప్రారంభమైంది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సత్యసాయి విద్యావాహిని ప్రాజెక్ట్‌కు అవసరమైన సాంకేతిక సహకారం కోసం ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పంద పత్రాలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ఐఐటీ మద్రాస్ ప్రతినిధులు పరస్పరం మార్చుకున్నారు. అనంతరం ప్రశాంతి నిలయంలోని సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సభలో కరుణామున్షి మాట్లాడారు. విద్యావాహిని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిద్దుతామన్నారు. అలాగే సత్యసాయి అశయాలను కొనసాగిస్తూనే... సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తామన్నారు. సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది.
విద్యావాహిని డైరెక్టర్ కరుణా మున్షి
విద్యా వ్యవస్థలో మార్పులు తేవడమే లక్ష్యం
విద్యా వ్యవస్థలో మార్పులు తేవడమే లక్ష్యం