
మామిడి తోటల పరిశీలన
తలుపుల: జిల్లా వ్యాప్తంగా మామిడి తోటల రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై ‘చేదు మిగిల్చిన మామిడి’ శీర్షికన ‘సాక్షి’లో వెలుడిన కథనంపై ఉద్యాన శాఖ అధికారులు స్పందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్థానిక వ్యవసాయాధి హరితతో కలసి ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్‌రెడ్డి బుధవారం తలుపుల మండలం టి.రెడ్డివారిపల్లి గ్రామంలో రైతు వెంకటరమణ సాగు చేసిన మామిడి తోటను పరిశీలించారు. రైతులకు నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనని నిర్ధారించారు. బీమా, నష్ట పరిహారాల విషయం ప్రభుత్వ బీమా సంస్థల పరిధిలో ఉందని పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధిలో
మహిళల పాత్ర కీలకం
● జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
అనంతపురం సిటీ: గ్రామీణాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా సర్పంచులకు అనంతపురం జిల్లా పరిషత్ క్యాంపస్‌లో గల డీపీఆర్‌సీ భవన్‌లో మూడ్రోజులుగా నిర్వహించిన డివిజనల్ స్థాయి శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ముగింపు సభకు జెడ్పీ సీఈఓ శివశంకర్ అధ్యక్షత వహించగా, చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక ప్రధాన భాగమన్నారు. ఇలాంటి తరుణంలో కేవలం ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై నంత మాత్రాన లక్ష్యం నెరవేరదన్నారు. పాలనలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకున్నప్పుడే రాజకీయాల్లో రాణించగలరన్నారు. ఇందుకు సరైన పరిజ్ఞానం, నైపుణ్యత, ఆత్మ విశ్వాసం అవసరమని పేర్కొన్నారు. మహిళా సర్పంచులు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకొని, గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై అవగాహన పెంచుకోగలిగితే పాలనారంగంలోనూ మహిళలు తీసిపోరని నిరూపించినట్లు అవుతుందన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణను పూర్తి చేసుకున్న మహిళా సర్పంచులకు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య అభినందనలు తెలిపారు. అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
కార్మికుల సమస్యలు
పరిష్కరించాలి
● రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మిక యూనియన్ అధ్యక్షుడు నాగభూషణ
పుట్టపర్తి టౌన్: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మిక యూనియన్ అధ్యక్షుడు నాగభూషణ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగభూషణ మాట్లాడారు. జీఓ 36 ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. హెల్త్ అలవెన్స్‌లు, రిస్క్ అలవెన్సులు అమలు చేయాలని, ఆప్కాస్ కార్మికులందనీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి మల్లికార్జున, సీఐటీయూ మండల కార్యదర్శి పైపల్లి గంగాధర్, యూనియన్ నాయకులు రామయ్య, నరసింహులు, కేశవ, రమణ, రామదాస్, బెస్త గంగాధర్, గణేష్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.

మామిడి తోటల పరిశీలన

మామిడి తోటల పరిశీలన