
ఇలా.. ఇంకెన్నాళు?!
పుట్టపర్తి మండలంలోని జగరాజుపల్లిలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించకపోవడంతో విద్యార్థుల ఇబ్బందులు పతాకస్థాయికి చేరుకున్నాయి. ధర్మవరం – గోరంట్ల ప్రధాన మార్గంలో పుట్టపర్తికి ఒకటిన్నర కిలోమీటరు దూరం ఉన్న ఈ పాఠశాలకు సమీప గ్రామాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో పాఠశాల వేళకు రావడం, బడి వేళలు ముగిసిన తర్వాత ఇళ్లకు చేరుకోవడంలో తీవ్ర ఆలస్యమవుతోంది. ఇలా ఇంకెన్నాళ్లు అవస్థలు పడాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. చీకటి పడినా ఇళ్లకు చేరకపోవడంతో తమను బడి మానాలంటూ తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారని పలువురు బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– పుట్టపర్తి అర్బన్: