
వంచనపై యువ గర్జన
పుట్టపర్తి: ఎన్నికల హామీలు అమలు చేయకుండా వంచించిన కూటమి సర్కార్ తీరుపై విద్యార్థులు, యువకులు కదం తొక్కారు. అలవిగాని హామీలతో నమ్మించి మోసం చేసిన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. పాలన చేతగాని సీఎం వెంటనే దిగిపోవాలని నినదించారు. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం పుట్టపర్తిలో నిర్వహించిన ‘యువత పోరు’కు విద్యార్థులు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలపడంతో కార్యక్రమం విజయవంతమైంది.
భారీ జనసందోహంతో ర్యాలీ
ఉదయం పుట్టపర్తి పట్టణంలోని గణేశ్ సర్కిల్ నుంచి మొదలైన యువత పోరు ర్యాలీ కలెక్టరేట్ వరకు భారీ జనసందోహం మధ్య సాగింది. చంద్రబాబు మోసాలను వివరిస్తూ యువకులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిరుద్యోగ భృతి ఏది బాబూ?.. ఇరవై లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తావ్ బాబూ, చేతకాని సీఎం రాజీనామా చేయాలి.. అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పుట్టపర్తి పుర వీధుల్లో చేసిన ర్యాలీకి భారీ మద్దతు లభించింది. అనంతరం విద్యార్థులు, నిరుద్యోగులు, యువత కలెక్టరేట్ ఎదుట బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యా, వసతి దీవెన బకాయిలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబులపతి సహా ఆయా మండలాల ఎంపీపీలు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు, సర్పంచులు, వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.
నిండా ముంచిన చంద్రబాబు
రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, ఇప్పటికే చదువులు పూర్తి చేసిన యువతను చంద్రబాబు ప్రభుత్వం నిండా ముంచింది. చదువుకునేందుకు ఆర్థికంగా చేయూత లేదు. అప్పు చేసైనా చదువు పూర్తిచేస్తే ఉద్యోగాలు లేవు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన ఒక్క హామీనీ చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఆర్థిక చేయూతనిచ్చి పేదల చదువులకు దోహదం చేసింది.
– గంగుల సుధీర్‌రెడ్డి,
జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం
అన్ని వర్గాలకూ మోసం
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులు, యువత, మహిళలు.. ఇలా అన్ని వర్గాలనూ మోసం చేసింది. తల్లికి వందనంలో అర్హులకు న్యాయం జరగలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థులకు చదువును దూరం చేశారు. విద్యార్థులపై దాడులతో పాటు వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవరకూ పోరాటం కొనసాగిస్తాం.
– పురుషోత్తం రాయల్,
జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
నిరుద్యోగులకు కుచ్చుటోపీ
నిరుద్యోగుల ఉసురు తగులుతుంది
కూటమి సర్కారు తీరుపై యువజనాగ్రహం
పుట్టపర్తిలో కదం తొక్కిన
విద్యార్థులు, యువకులు
గణేశ్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ
ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్
వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ విజయవంతం
రూ.7,800 కోట్ల బకాయిలు పెండింగ్
2024–25 విద్యా సంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,800 కోట్లు, హాస్టల్ నిర్వహణకు 1,100 కోట్లు, 2025–26 విద్యా సంవత్సరానికి రూ.2,600 కోట్లు మొత్తంగా రూ.7,800 కోట్లు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సి ఉందని వారు తెలిపారు. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్‌ఓ విజయసారథికి అందించారు.

వంచనపై యువ గర్జన

వంచనపై యువ గర్జన

వంచనపై యువ గర్జన

వంచనపై యువ గర్జన

వంచనపై యువ గర్జన