
మోసం ఆయన నైజం
మోసం చంద్రబాబు నైజం. అబద్ధాలు చెప్పడంలోనూ ఆయన దిట్ట. బాబు మాటిచ్చారంటే మోసం గ్యారెంటీ. ఇప్పటికే ఎన్నోసార్లు ఇది రుజువైనా యువకులు, విద్యార్థులు మరోసారి ఆయన మాటలు నమ్మి ఓట్లేశారు. కానీ ఆయన బుద్ధి మారలేదు. ఉద్యోగాలు లేవు. పోనీ నిరుద్యోగ భృతి ఇస్తారంటే అదీ లేదు. చదువుకుందామంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ అందదు. పైగా హామీలన్నీ నెరవేర్చానంటూ ఎదురుదాడికి దిగారు. మోసాల బాబుకు బుద్ధి చెప్పితీరుతాం.
– సందీప్ నాయుడు, యువజన విభాగం నేత, పుట్టపర్తి
పశుమాంసం రవాణా కేసులో
11 మంది అరెస్ట్
హిందూపురం: పశుమాంసం అక్రమ రవాణా ఘటనలో హిందూపురం పోలీసులు సోమవారం 11 మందిని అరెస్టు చేశారు. డీఎస్పీ మహేష్ తెలిపిన వివరాల మేరకు.. హిందూపురం నుంచి తరలుతున్న పశుమాంసాన్ని ఆదివారం తెల్లవారుజామున సంతేబిదనూర్ గేట్ వద్ద హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆరు వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు సోమవారం 11 మందిని అరెస్ట్ చేశారు. అలాగే స్వాధీనం చేసుకున్న 6.5 టన్నుల పశుమాంసాన్ని అధికారుల సమక్షంలో కిరికిరా డంపింగ్ యార్డ్ వద్ద పూడ్చివేశారు. అరెస్ట్ అయిన వారిలో హిందూపురానికి చెందిన ఫరూక్, అనీఫ్, అస్లాం, అసిఫుల్లా బేగ్, మహమ్మద్ జుబేర్, మహమ్మద్ మౌలాసాబ్, షేక్ ఇమ్రాన్, షేక్ జబివుల్లా, కొలిమి జమీర్ ఖాన్, అఫ్రిద్, జాకీర్‌లు ఉన్నారు. అధికారుల అనుమతులతోనే మాంసం షాపులు నిర్వహించాలని, అక్రమంగా ఎవరైనా నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

మోసం ఆయన నైజం

మోసం ఆయన నైజం