
చంద్రబాబుకు పాలించే అర్హత లేదు
విద్యార్థులు, యువతకు అలవిగాని హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదు. ఉద్యోగం కల్పించకపోతే నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా రూ.3 వేలు ఇస్తామని ఆశపెట్టారు. పగ్గాలు చేపట్టి ఏడాది దాటినా భృతి ఊసే లేదు. ఇక విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పిస్తామని చెప్పి మోసం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా వేధిస్తున్నారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకు పాలించే అర్హత లేదు.
– లింగారెడ్డి,
రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం