
బుద్ధిచెప్పి తీరుతాం
వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మరీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. యువతకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసి స్వయం ఉపాధికి అండగా నిలుస్తామన్న పవన్ కల్యాణ్ కూడా నేడు నోరు మెదపడం లేదు. యువకులు, విద్యార్థులను మోసం చేసిన కూటమి సర్కార్‌కు రానున్న రోజుల్లో బుద్ధి చెప్పితీరుతాం.
– అమర్‌నాథ్‌రెడ్డి,
రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం