
రోటావేటర్‌లో పడి విద్యార్థి దుర్మరణం
రొద్దం: ప్రమాదవశాత్తు రోటావేటర్‌లో పడి ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... రొద్దం మండలం రాగిమేకులపల్లికి చెందిన నరసింహులు కుమారుడు ప్రేమ్‌కై లాష్ (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంటి పట్టునే ఉన్న బాలుడు.. ఓ రైతు పొలాన్ని విత్తుకు సిద్ధం చేసేందుకు వెళుతున్న ట్రాక్టర్ డ్రైవర్‌తో కలసి వెళ్లాడు. పొలంలో ట్రాక్టర్‌కు రోటావేటర్ అమర్చుకుని డ్రైవర్ పొలాన్ని కలియబెడుతుండగా దానిపై కూర్చొని ఉన్న ప్రేమ్‌కై లాష్ పట్టు తప్పి కిందపడ్డాడు. అదే సమయంలో రోటావేటర్ ముందుకు సాగడంతో అందులో చిక్కుకున్నాడు. డ్రైవర్ గమనించి ట్రాక్టర్ ఆపేలోపు ప్రాణాలు కోల్పోయాడు. వెలికి తీసేందుకు వీలు లేనంతగా చిన్నారి శరీరం అందులో చిక్కుకుపోయింది. మొండెం నుంచి తల వేరుపడింది. కుమారుడు మృతితో నరసింహులున అలివేలమ్మ దంపతులు బోరున విలపించారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ సోమిరెడ్డి పరామర్శించి, ఓదర్చారు.
నేడు ‘పోలీసు స్పందన’
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్పీ వి.రత్న ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశౠరు. అర్జీదారులు తమ వెంట ఆధార్ కార్డును తప్పని సరిగా తీసుకురావాలి.
ప.గో. జిల్లా వాసుల పర్తి యాత్ర
ప్రశాంతి నిలయం: పర్తి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు సత్యసాయి భక్తులు ఆదివారం పుట్టపర్తికి చేరుకున్నారు. సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. జీవితంలో కోరికల మూలంగా జరిగే పరిణామాలను వివరిస్తూ కోరిక పేరుతో బాలవికాస్ చిన్నారులు ప్రదర్శించిన నృత్యరూపకం ఆకట్టుకుంది.

రోటావేటర్‌లో పడి విద్యార్థి దుర్మరణం