
సడ్లపల్లె కథా పురస్కారాల ప్రదానం
హిందూపురం టౌన్: పట్టణంలోని టీచర్స్ కాలనీలో తపన సాహితీ వేదిక ఆధ్వర్యంలో సడ్లపల్లె కథా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రచయిత శశికళ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా డీఎస్పీ మహేష్ పాల్గొన్నారు. 2024వ సంవత్సరానికి గానూ చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు బాలాజీ రాసిన ‘ఏకలవ్య ఎరుకల కాలనీ జీవన గాథలు‘ అనే పుస్తకానికి, అలాగే తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన స్వర్ణకిలారి రాసిన ‘నల్లబంగారం‘ అనే పుస్తకానికి ‘సడ్లపల్లె కథా పురస్కారాలు అందజేశారు. అలాగే డాక్టర్ శాంతినారాయణ అధ్యక్షతన కాకినాడకు చెందిన ప్రజా వైద్యుడు డా.యనమదల మురళీకృష్ణ వైద్య సేవలకు గానూ ‘తపన సాహిత్య వేదిక ’ సేవా పురస్కారాన్ని అందజేసి, నగదు బహుమతితో పాటు సత్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ 100 కిలో మీటర్ల దూరంలోని బాలాజీ కథలను, 1000 కిలోమీటర్ల దూరం లోని స్వర్ణ కిలారీ కథలను చదివి పురస్కారాలు ఇవ్వడం హర్షణీయమన్నారు. తపన సాహిత్య వేదిక వ్యవస్థాపకుడు సడ్లపల్లె చిదంబరరెడ్డి మాట్లాడుతూ రచయితలు, కవులకు పొత్సహించడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పెద్దిరెడ్డి, డాక్టర్ యమున, డాక్టర్ ప్రగతి, మానవ హక్కుల వేదిక ఎంఎం బాషా, జాబిలి చాంద్‌బాషా, కల్లూరు రాఘేంద్రరావు, రైతు నాయకుడు వెంకటరామిరెడ్డి, ఈశ్వరరెడ్డి, మానవత అమరనాథరెడ్డి, పౌర హక్కుల సంఘం శ్రీనివాసులు, యువకవి కై మలి, సిద్దగిరి శ్రీనివాస్, అశ్వత్థనారాయణ, యువకవి గంగాధర్, ఆంధ్రరత్న గంగధర్, ఉమర్ ఫారూక్ తదితరులు పాల్గొన్నారు.