
యోగాతో ఆరోగ్యవంతమైన సమాజం
హిందూపురం టౌన్: దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని కలెక్టర్ చేతన్ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పట్టణంలోని ఎంజీఎం క్రీడామైదానంలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ చేతన్‌తో పాటు ఎస్పీ రత్న, జేసీ అభిషేక్‌కుమార్, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. యోగా పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, మెమొంటోలను అందజేశారు. అనంతరం స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రమేష్, పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్, డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
యోగా దినోత్సవంలో
కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న

యోగాతో ఆరోగ్యవంతమైన సమాజం