
ప్రతి ఒక్కరికీ ఎన్‌సీడీ సర్వే
పుట్టపర్తి అర్బన్: అసంక్రమిత వ్యాధులను అరికట్టి అందరినీ ఆరోగ్యవంతుల్ని చేయడానికి ఎన్‌సీడీ (నాన్ కమ్యూనకబుల్ డిసీజ్) సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్‌బేగం పేర్కొన్నారు. ఎన్‌సీడీ సర్వేపై పుట్టపర్తిలోని మండల సమాఖ్య కార్యాలయంలో వైద్యాధికారులు, సీహెచ్‌ఓలు, వైద్య ఆరోగ్య సిబ్బందికి శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎన్‌సీడీ పరీక్షలు పక్కాగా చేపట్టాలన్నారు. ప్రత్యేకంగా నోటి, రొమ్ము పరీక్షలను నిర్వహించాలన్నారు. ప్రధానంగా ఈ పరీక్షలు గర్భిణులు, బాలింతలు, యుక్త వయస్సుల వారి ఆరోగ్యంపై నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్రనాయక్, డీపీఓ నాగరాజు, నూర హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు శివ, శివశంకర్, శ్వేత, డాక్టర్ సరిత, డాక్టర్ ఆశ్రిత, తదితరులు పాల్గొన్నారు.
కంటి పరీక్ష కేంద్రాల్లో తనిఖీ
ధర్మవరం అర్బన్: పట్టణంలోని కంటి పరీక్ష కేంద్రాలను డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్‌బేగం శుక్రవారం తనిఖీలు చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద ఆప్తాలమిక్ డాక్టర్లు, సిబ్బంది అర్హత సర్టిఫికెట్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అందజేసి రిజిస్టర్ చేసుకోవాలని నేత్రాలయ, అక్షయ కంటి పరీక్ష కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. బోర్డుల్లో ఆపరేషన్లు చేయనున్నట్లు ప్రదర్శించరాదని వాటిని తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె వెంట జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్రనాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సెల్వియా సాల్మన్, డిప్యూటీ డెమో ఫకృద్దీన్ తదితరులు ఉన్నారు.