
బెల్టు షాపుల నిర్వాహకుల అరెస్ట్
హిందూపురం: స్థానిక ముదిరెడ్డిపల్లి ప్రాంతంలో అనధికారికంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, 30 క్వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ రాజగోపాలనాయుడు తెలిపారు. అందిన సమాచారం మేరకు గురువారం తనిఖీలు చేపట్టామన్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించామన్నారు.
నాటు సారా నిర్మూలనకు పటిష్ట చర్యలు : ఎక్సైజ్ డీసీ
గుంతకల్లు: ఉమ్మడి జిల్లాలో నాటు సారా నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య స్పష్టం చేశారు. గుంతకల్లులోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం అనంతపురం, కర్నూలు జిల్లా సరిహద్దులో నాటు నారా నిర్మూలనకు చేపట్టాల్సిన కార్యాచరణపై కర్నూలు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ హనుమంతురావు, ఏఈఎస్ రాజశేఖర్‌గౌడ్, సీఐ శివసాగర్, అనంతపురం స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్లు జయనాథరెడ్డి, సుహాసిని, కర్నూలు స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్ జయరామ్‌నాయుడుతో కలిసి చర్చించారు. నాటు సారా తయారీ కేంద్రాలపై తరుచూ సంయుక్త దాడులు నిర్వహించాలని తీర్మానించారు. బైండోవర్ కేసుల్లోని వ్యక్తులపై నిఘా మరింత పెంచాలని నిర్ణయించారు.

బెల్టు షాపుల నిర్వాహకుల అరెస్ట్