
ప్రైవేట్ పాఠశాల సీజ్
బత్తలపల్లి: ఎలాంటి అనుమతులు లేకుండా బత్తలపల్లిలో నిర్వహిస్తున్న ఫోనిక్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను సీజ్ చేసినట్లు ఎంఈఓలు చాముండేశ్వరి, సుధాకర్‌నాయక్ తెలిపారు. డీఈఓ ఆదేశాల మేరకు గురువారం ఆ పాఠశాలలో తనిఖీలు చేపట్టామన్నారు. అనుమతులు లేనందున సీజ్ చేసినట్లు వివరించారు.
గ్రంథాలయం తనిఖీ
చిలమత్తూరు: మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.రమ గురువారం తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. పంచాయతీల నుంచి అందాల్సిన సెస్ బకాయిలను వసూలు చేయాలని గ్రంథాలయాధికారి మల్లికార్జునకు సూచించారు. అనంతరం పాఠకులతో మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రైవేట్ పాఠశాల సీజ్