
లారీ ఢీకొని వ్యక్తి మృతి
గుత్తి: లారీ ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహన చోదకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా తుగ్గలి మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన ఖాసీం (52) తన స్నేహితుడు హరిజన పెద్దయ్యతో కలసి ద్విచక్ర వాహనంపై గురువారం గుత్తికి వచ్చాడు. గుత్తి ఆర్‌ఎస్‌లోకి చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం వెనుక కూర్చొన్న ఖాసీం ఎగిరి రోడ్డుపై పడడంతో అతని తల మీదుగా లారీ చక్కాలు దూసుకెళ్లి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.