
నలుగురు జీవిత ఖైదీల విడుదల
బుక్కరాయసముద్రం: మండలంలోని రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి నలుగురు జీవిత ఖైదీలు విడుదలయ్యారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ రహమాన్ తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేస్తూ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఓపెన్ ఎయిర్ జైలుకు చెందిన నలుగురు ఖైదీలు ఉన్నారు. విడుదలైన వారిలో ప్రకాశం జిల్లా పొన్నలూరు గ్రామానికి చెందిన రామస్వామి, వైఎస్సార్ కడప జిల్లా తొండూరు మండలం గొట్లూరు గ్రామానికి చెందిన పోల్‌రెడ్డి, అదే జిల్లా కడపలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన ఫకృద్దీన్, నెల్లూరులోని జీనిగిల వీధికి చెందిన చంద్రశేఖర్ ఉన్నారు. వీరికి విడుదల ఆర్డర్ కాఫీతో పాటు నూతన వస్త్రాలను అందజేసి బుధవారం రాత్రి సాగనంపినట్లు జైలు సూపరింటెండెంట్ రహమాన్ తెలిపారు.