
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దవడుగూరు: మండల పరిధిలోని రావులుడికి గ్రామంలో రైతు శివశంకర్‌రెడ్డి (56) అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు.. శివశంకర్‌రెడ్డి ఉదయాన్నే రైతులు పుల్లారెడ్డి, ప్రతాప్‌రెడ్డి లతో కలిసి తోట వద్దకు వెళ్లారు. మృతుడు తన పొలం వద్దకు వెళ్లాడు. నీటి తొట్టెలో నీళ్లు లేకపోవడంతో మోటర్ వద్దకు వెళ్లాడు. కరెంటు లేకపోవడంతో సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా ఫీజు కట్ అయి ఉండటంతో ఫీజు వేసేందుకు యత్నించగా విద్యుదాఘాతంతో అక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జమెదారు అన్వర్‌బాషా తెలిపారు.