
కక్ష సాధింపుతోనే అక్రమ అరెస్టులు
● మాజీ మంత్రి శంకర నారాయణ
సాక్షి, పుట్టపర్తి: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం కొనసాగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ ఒక ప్రకటనలో విమర్శించారు. అక్రమ మద్యం కేసులో సాక్ష్యాలు లేకున్న తప్పుడు వాంగ్మూలాలను అడ్డు పెట్టుకొని విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌లను వేధిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీసీ హయాంలో మద్యం కల్తీ జరిగితే, నేడు కూటమి ప్రభుత్వం అవే డిస్టిలరీల నుంచి మద్యం ఎందుకు కోనుగోలు చేస్తోందో చెప్పాలన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే రిటైర్డ్ అధికారులు, సీనియర్ సిటిజన్‌లను వేధిస్తోందన్నారు. ఇప్పటికే కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసుకొని సస్పెన్షన్ వేటు కూడా వేశారన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులతోనే అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు.