
●వాస్తు దోషమని మూతేశారు!
ధర్మవరం రూరల్: స్థానిక మార్కెట్ యార్డ్ మొదటి గేటు కొంత కాలంగా మూత పడింది. మార్కెట్‌యార్డ్‌కు రెండు ప్రధాన గేట్లు ఉండగా ఇందులో పట్టణం వైపు నుంచి ప్రవేశించే మొదటి గేటును వాస్తు దోషం ఉందంటూ అధికారులు మూతేశారు. దీంతో మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న ప్రభుత్వ రేషన్ గోదాం, ఆర్టీఓ కార్యాలయం, వ్యవసాయ గోదాంలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకపోకలకు ఇబ్బంది నెలకొంది. ప్రస్తుతం సుదూరాన ఉన్న రెండవ గేటు ద్వారానే మార్కెట్ యార్డులోకి రాకపోకలు సాగించాల్సి వస్తోంది. సైన్స్ పరిజ్ఞానం పెరుగుతున్న ఈ రోజుల్లో మూఢ నమ్మకాలతో అధికారులు గేటు మూసేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.