వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి పరామర్శ
బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో రానున్న వైఎస్సార్ సీపీ అధినేత
సాక్షి, పుట్టపర్తి: మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గోరంట్ల మండలం కల్లితండాకు రానున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకాశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు తిరుగు పయనం అవుతారు.
రండి.. వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శిద్దాం
కార్యకర్తలకు ఉషశ్రీచరణ్ పిలుపు
సోమందేపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గోరంట్ల మండలం కల్లితండాకు విచ్చేస్తున్నారని, పార్టీ శ్రేణులు తరలిరావాలని ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆమె జెడ్పీటీసీ సభ్యుడు అశోక్ నివాసంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ... వైఎస్ జగన్ ఉదయం 11.30 గంటలకు వీర జవాన్ మరళీ నాయక్ నివాసానికి చేరుకుంటారని తెలిపారు.
వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నియోజక వర్గం నుంచి భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యర్తలు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, పట్టణ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ వెంకటనారాయణ రెడ్డి, సర్పంచ్‌లు అంజినాయక్, జిలాన్‌ఖాన్, ఎంపీటీసీ నాగప్ప, నాయకులు ఆదినారాయణరెడ్డి, జితేంద్ర రెడ్డి, రమేష్, కళ్యాణ్, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు కల్లితండాకు వైఎస్ జగన్