
సెమీ ఫైనల్‌కు అనంత, కదిరి జట్లు
అనంతపురం: సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు, దివంగత చంద్రమోహన్ స్మారకార్థం నిర్వహిస్తున్న టోర్నీలో సెమీఫైనల్‌కు అనంతపురం రైజింగ్ స్టార్, కదిరి జట్లు చేరుకున్నాయి. తాడిపత్రి దినేష్ గ్రానైట్స్, అనంతపురం రైజింగ్ స్టార్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో దినేష్ గ్రానైట్స్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. 17.1 ఓవర్ల వద్ద పది వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన అనంత రైజింగ్ స్టార్ జట్టు 17 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి 114 పరుగులతో విజయాన్ని కై వసం చేసుకుంది.
● కదిరి, తాడిపత్రి ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో కదిరి జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టి 62 పరుగులు చేసింది. జట్టులో పి. గిరినాథరెడ్డి 45 పరుగులు , వి.భాను ప్రకాష్ 30 పరుగులు, కె.ప్రశాంత్ 39 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన తాడిపత్రి ఎలెవన్ జట్టు 131 పరుగుల వద్ద చతికిలపడింది. దీంతో అనంతపురం రైజింగ్ స్టార్, కదిరి జట్లు సెమీఫైనల్‌కు చేరాయి. మాజీ రంజీ ఆటగాడు షాబుద్దీన్, ఏడీసీఏ అధ్యక్షుడు పీఎల్ ప్రకాష్‌రెడ్డి, సెక్రెటరీ వి. భీమలింగా రెడ్డి, వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.