
చాగల్లు రిజర్వాయర్‌లో వ్యక్తి గల్లంతు
శింగనమల: ఉల్లికల్లు సమీపంలోని చాగలు రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌లోకి దిగిన ఉల్లికల్లు శ్రీరాములు(48) గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. ఉల్లికల్లుకు చెందిన శ్రీరామలుకు భార్య, కుమారుడు ఉన్నారు. శ్రీరాములు శనివారం మద్యం తాగి చాగల్లు రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌లో నడుచుకుంటూ వెళ్లాడు. స్థానికులు చూసి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వచ్చేసరికి అతడు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ విజయకుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రెస్క్యూ టీంను పిలిపించి సాయంత్రం వరకు నీటిలో వెతికించినా శ్రీరాములు జాడ కనిపించలేదు.