
ప్రజల గొంతుకను నొక్కుతారా?
సోదాలు హేయం
సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో సోదాలు చేయడం సరికాదు. పత్రికల్లో వచ్చిన వార్తలపై పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం పాత్రికేయుల నైతిక బలాన్ని హరించడమే. కోర్టులో కేసు నడుస్తుండగా ఎలాంటి నోటీసులు లేకుండా సోదాలు చేయడం హేయం. ప్రజాస్వామ్య వాదులందరూ కూటమి ప్రభుత్వ చర్యలు ఖండించాలి. – ఆదినారాయణ, జాప్ జిల్లా అధ్యక్షుడు
మీడియా స్వేచ్ఛను హరిస్తారా?
నిబంధనలు పాటించకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లి భయబ్రాంతులకు గురి చేయడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇది మీడియాకు గొడ్డలిపెట్టు. ప్రజాస్వామ్యవాదులు మీడియా స్వేచ్ఛను కోరుకునే వారు సోదాలను ఖండించాలి. – పుల్లయ్య,
ఏపీయూడబ్లూజే జిల్లా అధ్యక్షుడు
సాక్షిబృందం: కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా కథనాలు కనిపిస్తే చాలు తట్టుకోలేకపోతున్నారు. కక్షసాధింపులకు దిగుతూ జర్నలిస్టులను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి నోటీసులు లేకపోయినా సోదాల పేరుతో పోలీసులు గురువారం ఉదయం ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని హరించేలా వ్యవహరించిన ప్రభుత్వ తీరును జర్నలిస్టు సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు.

ప్రజల గొంతుకను నొక్కుతారా?

ప్రజల గొంతుకను నొక్కుతారా?

ప్రజల గొంతుకను నొక్కుతారా?

ప్రజల గొంతుకను నొక్కుతారా?