
నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపు
ధర్మవరం అర్బన్: నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపును అందించవచ్చని విశ్వదీప సేవా సంఘం ఫౌండర్ కోళ్లమొరం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన అన్నం వెంకటనారాయణ (80) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. విశ్వదీప సేవా సంఘం సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు నేత్రదానానికి అంగీకరించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర, భాస్కర్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, కంటి వైద్యులు డాక్టర్ నరసింహులు మృతుని నేత్రాలను సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని కుమారులు అన్నం లోకేష్, సోమశేఖర్, మనవడు అనంతసాగర్‌లకు సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేత్రాలు మరో ఇద్దరికి చూపును అందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వదీప సేవా సంఘం అధ్యక్షుడు గాజుల సురేష్, వైస్ ప్రెసిడెంట్ టి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీజీ హట్టిలో
మళ్లీ అతిసారం కేసులు
● 9 మందికి చికిత్స అందిస్తున్న వైద్యులు
రొళ్ల: మండల పరిధిలోని జీజీ హట్టి గ్రామంలో అతిసారం అదుపులోకి రావడం లేదు. ఐదు రోజులుగా దాదాపు 35 మంది అస్వస్థతకు గురవగా.. అమూల్య (11) మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. గురువారం కూడా చిన్నారులు దర్శన్, వందన, దొడ్డపూజారప్ప గారి మారన్న, కాడమ్మతో పాటు ఈరమ్మ, అశ్విని, భాగ్యమ్మ, లోకేష్, చిక్కీరప్ప అతిసారం బారిన పడ్డారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్న కూడా అతిసార మాత్రం తగ్గుముఖం పట్టలేదు. చిక్కీరప్ప హిందూపురం, ఈరమ్మను మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దర్శన్, వందన, దొడ్డపూజారప్ప గారి మారన్న, కాడమ్మతో పాటు అశ్విని, లోకేష్ రొళ్ల సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మంజువాణి, డీఐఓ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్లు హర్షమిత్ర, సౌందర్య, ఎఫడామాలజిస్ట్ బాలాజీ తదితరులు గ్రామంలో పర్యటించి పలు సూచనలు చేశారు. నీటి సంపులు, డ్రమ్ములో నిల్వ ఉంచిన నీటిని శుభ్రం చేసుకోవాలన్నారు. అతిసార వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని తెలియజేశారు.

నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపు

నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపు